జగన్ విధ్వంస పాలన ఆ కూల్చివేత నుంచే ప్రారంభం : చంద్రబాబు

మంగళవారం, 30 మే 2023 (16:36 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో నాలుగేళ్లు పూర్తయింది. ఈ నాలుగేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనపై అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విపక్ష నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే ప్రజా వేదిక భవనం కూల్చివేత నుంచి పాలన ప్రారంభించారంటూ గుర్తుచేశారు. 
 
ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ ఫ్రమ్ ది బిల్డింగ్ అంట జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 'వైఎస్ జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే వైకాపా ప్రభుత్వం నిత్యం పాటిస్తోంది. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో రాష్ట్ర విధ్వంసం మొదలైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు, ప్రజా వేదిక కూల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు