టీడీపీకి అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యం : నారాయణ

గురువారం, 4 జులై 2019 (12:07 IST)
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో అవినీతి మరక అంటించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి పి.నారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. 
 
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ.1,546 - రూ.1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు