ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. అయితే, ఈసారి ఎన్నికల్లో పలువురు టీడీపీ నేతల వారసులు, బంధువులు కూడా బరిలో ఉన్నారు. దాదాపు 20 మంది వరకూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. వీరిలో కొందరు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండగా మరికొందరికి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది
తొలిసారి పోటీ చేయబోయేది వీరే!
కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం): ఈయన దివంగత కొండపల్లి పైడితల్లినాయుడి మనవడు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడికి సోదరుడి కుమారుడు. శ్రీనివాస్ తండ్రి కొండలరావు గతంలో గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు.