టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు.