మేకతోటి సమక్షంలో వైసిపిలో చేరిన తోకవారిపాలెం తెదేపా నాయకులు

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:37 IST)
ప్రత్తిపాడు నియోజకవర్గం రూరల్ మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హోంమంత్రి మేకతోటి సుచరిత గారి సమక్షంలో వైస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. తోకవారిపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి యలగాల రామకృష్ణ కూడా వైస్సార్సీపీ లో చేరడం జరిగింది. గ్రామానికి చెందిన దాదాపు చెందిన ఇరవై కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

బ్రాడిపేట లోని నివాసం వద్ద ఆలా శివ నాగేశ్వరరావు, అర్ధుల సుబ్బరాజు, మాగంటి బాలరాజు, గండు గోపి, మహేష్, వీర్ల శ్రీనివాసరావు, తోక సాయి, ఆల వెంకయ్య ఇతర టీడీపీ నాయకులకు హోంమంత్రి సుచరిత గారు వైస్సార్సీపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. వీరంతా వైస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల సుబ్బారావు, పార్టీ ప్రెసిడెంట్ కోపూరి నానిబాబు, బత్తుల వెంకట్రావు ల ఆధ్వర్యంలో పార్టీ లో చేరడం జరిగింది.

టీడీపీ నుండి వైస్సార్సీపీ లో వారికి హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం, పార్టీ లని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తున్నారని యలగాల రామకృష్ణ పేర్కొన్నారు. తోకవారిపాలెం గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు