తన కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాసుకోవచ్చు కానీ వేరేవాళ్ళ విషయాలలో తల దూర్చకూడదు. బెయిల్ కేన్సిల్ అయితే ఏదో ఒక జైలుకు వెళ్ళాల్సిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టుకు లెటర్ రాయకూడదు. ప్రజా సమస్యల మీద పోరాడచ్చు, కానీ భారతదేశ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాయకూడదు.
సోషల్ మీడియా విషయాలపై టిడిపి పెట్టిన 50వ కేసు అవుతుంది. కంప్లైంట్‌లు, అరెస్టులు మాత్రం శూన్యం. పంచుమర్తి అనూరాధ మీద యూట్యూబ్ వేదికగా పోస్టింగ్ పెట్టిన, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి, అరెస్టు చేయాలి అంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.