గతంలో రాసిన స్క్రిప్ట్‌తో ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు ఇంకా నీకు అర్ధం కాలేదా? నీ బదిలీలలు త్వరలోనే బయటకి వస్తాయి.
తండ్రి ఇచ్చిన అనుమతులు కొడుకు రద్దు చేసాడు అని బిల్డ్ అప్ ఎందుకు శకుని మామా...? అనుమతులు ఇప్పించినందుకే 1700 కోట్లు అప్పట్లో మీరు కొట్టేసారు కదా మర్చిపోయావా? పాత పద్దుల పుస్తకం తిరగేయ్ బాక్సైట్ లెక్క ఉంటుంది. పుస్తకాలు కాల్చేస్తే లెక్క సీబీఐ దగ్గర దొరుకుతుంది ఒక్క సారి అడిగి చూడు.. అంటూ తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు.