ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముకోవడం నిజం కాదా: నారా లోకేశ్

ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (14:10 IST)
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో స్పందించారు. 
 
'జరగని పేపర్ లీకేజి మీద నానా రభస చేశారు అప్పట్లో గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీ చూసుకోండి. అప్పట్లో రాజీనామా చెయ్యాలి, సిబిఐ విచారణ చెయ్యాలి అన్నారు? మరి ఇప్పుడు ఏమి చేద్దాం? గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్న పత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. 
 
మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం. పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు. మరి మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో  మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సూటిగా ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు