ఇపుడు సత్తెనపల్లి అంబటి రాంబాబు మాట్లాడుతూ, గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజ నిర్ధారణ పేరుతో గుడివాడపై టీడీపీ దాడికి వెళ్లిందని ఆయన అన్నారు. సంస్కృతి, సంప్రదాయం అంటూ మంత్రి కొడాలి నానిపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. తమది ఉద్యోగులపై కక్ష సాధించే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అందువల్ల ఉద్యోగులు చర్చలకు రావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.