ఈ కేసులో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, జూన్ 23, 24 తేదీలలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు విడుదల చేసిన బులెటిన్, రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు లేఖలు చూస్తే పిటిషనర్‌ను ఎలా ట్రీట్ చేశారో తెలిసిపోతుందని, కొలనోస్కోప్ చేసిన తర్వాత బయాప్సి నివేదిక రాకుండానే... అచ్చెన్నాయుడిని ఎందుకు డిశ్చార్జి చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.