ఇప్పటికే బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సొంతపార్టీలో గుబులు రేపుతున్న గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... తాజాగా మరో సంచలనం రేపారు. ఈసారి ఏకంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు.