ఎన్డీయేకు తలాక్.. తలాక్.. తలాక్ అంటూ టీడీపీ ఎంపీల నినాదాలు (వీడియో)

శుక్రవారం, 16 మార్చి 2018 (11:43 IST)
కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి అధికార తెలుగుదేశం పార్టీ వైదొలగింది. ఆ తర్వాత ఢిల్లీతో పాటు.. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, టీడీపీకి చెందిన ఎంపీలు మరింత ఘాటుగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద చేరి ఆందోళన చేశారు. ఎన్డీయేకు తలాక్.. తలాక్... తలాక్ అంటూ వారు నినాదాలు చేశారు. 
 
అంతకుముందు... శుక్రవారం ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్‌సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితం అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆపై మీడియాతో మాట్లాడిన తోట నరసింహం, ఆంధ్రప్రదేశ్‌పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ అధినేత అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని తోట నరసింహం వ్యాఖ్యానించారు. 
 

#WATCH TDP MPs stage protest in front of Mahatma Gandhi statue in Parliament, raise slogans of 'We want justice, NDA talaq, talaq, talaq.' pic.twitter.com/qOWDBOqO9q

— ANI (@ANI) March 16, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు