తెదేపా సీనయర్ నేత, మాజీ మంత్రి గారపాటి ఇకలేరు

బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:10 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు ఇకలేరు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 75 యేళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం ఉదయం మృతి చెందారు. 
 
ఆయన స్వగృహం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం. ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మరణం విచారకం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివ రావు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేసి తనదైన ముద్ర వేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు