ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో యేడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానించారు.
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమా మహేశ్వర రావు, అశోక్ బాబు, టీడీ జనార్థన్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా బొండా ఉమా మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముఖ్యంగా, వైకాపా అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు.