వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, పలమనేరు పాతపేట పోలీసు లైన్ వీధిలో నిరంజన్ నివాసం ఉండేవాడు. బెంగుళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో నిరంజన్ సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. కరోనా మొదలైనప్పటి నుండి ఇంటి దగ్గర ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగం చేస్తున్నాడు.
కోవిడ్ సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ఓ ముస్లీం కుటుంబంతో నిరంజన్ కి విభేదాలు తలెత్తాయి. ఆపై సర్దుకుపోయాయి. అయితే రెండు రోజుల క్రితం నిరంజన్ ఇంటి వద్ద అద్దెకు ఉండే మహిళ, ముస్లిం కుటుంబంతో సన్నిహితంగా ఉండేది. దీనిని గమనించిన నిరంజన్ ఎదురుగా నివాసం ఉంటున్న ఆ ఇంటికి వెళ్ళవద్దని చెప్పాడు.
ఇదే విషయాన్ని ఆ మహిళ ముస్లిం కుటుంబీకులకు చెప్పడంతో ఒక్కసారిగా వారు ఆవేశానికి గురయ్యారు. అంతేగాకుండా దాదాపు పది మంది మూకుమ్మడిగా నిరంజన్ పైకి దాడికి దిగారు. నిరంజన్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, తమతో పాటుగా తెచ్చుకున్న సుత్తితో నిరంజన్ శరీర భాగాలపై కొట్టారు.