ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రం లీక్ పుకార్లు

బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:55 IST)
ఏపీలో బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో 6 లక్షల 2 వేల 537 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ ను విధించి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
పరీక్షల నిర్వహణలో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంకు తెలియజేయాలని అధికారులు కోరారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రం లీక్ అయ్యిందని వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  చిత్తూరు జిల్లాలో లీక్‌ విషయమై పుకార్లు వ్యాపించడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.  
 
ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన విద్యాశాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా జిల్లాలో పరీక్షా పత్రం లీక్‌ అయినట్లు వచ్చిన వదంతులు నమ్మవద్దని చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్‌  తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు