ఈ పరిస్థితుల్లో ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర ఒకేసారి రూ.260కి పెరిగింది. మార్చి 21న రూ.220 ఉండగా, 28 నాటికి రూ.200కు తగ్గింది. అయితే మళ్లీ ధర భగ్గుమంటోంది. ఇటీవల రిటైల్ మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.230 ఉండగా, అదనంగా రూ.30 పెరిగింది. నాలుగు నెలల క్రితం స్కిన్‌లెస్ రూ.120 నుంచి రూ.140 వరకు ఉండేది. అయితే కొన్నిసార్లు ధర పెరగడం, మరికొన్నిసార్లు తగ్గడం జరుగుతోంది.
గతేడాది కరోనా సమయంలో చికెన్ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. కరోనా విషయంలో చికెన్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోవడంతో చాలా మంది మళ్లీ చికెన్ తినడం ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్ వినియోగం కాస్త తగ్గి ధరలు కూడా తగ్గాయి. మళ్లీ మార్చి మూడో వారం నుంచి ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి.