తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభను తక్షణం అరెస్టు చేయాలంటూ హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఆమె ఆందోళన చేపట్టింది.
ఈ ఆందోళన ఉధృతమవుతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రమ్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో కేసీఆర్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.