మరోవైపు, ఆర్టీసీ బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య హౌస్ అరెస్ట్ చేశారు. వీ హనుమంతరావు, మధుయాష్కీ, కూన శ్రీశైలం గౌడ్ ఇంటి ఎదుట పోలీసులను భారీగా మోహరించారు. జేబీఎస్ దగ్గర టీజేఎస్ అధినేత కోదండరామ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
సీపీఐ ఆఫీసులో ఆ పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సీపీఎం నేత తమ్మినేని అరెస్ట్ చేశారు. ఎంజీబీఎస్ దగ్గర ఆర్టీసీ జేఏసీ నేత హనుమంతు సహా పలువురు నేతల అరెస్ట్ చేశారు.
అదేవిధంగా, ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాల్గొనని వారంతా తెలంగాణ ద్రోహులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అబిడ్స్‌లో బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. హరీశ్‌రావు, ఈటలకు పదవులు శాశ్వతం కాదన్నారు.