మరోవైపు, కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా చర్చలతో పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఇబ్బంది ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. భైంసా డిపో మేనేజర్‌పై జరిగిన దాడితో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు.