ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే ఉత్సహంతో ఉన్న ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారితోపాటు, యానాంకు చెందిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో శనివారం రాత్రే విశాఖ చేరుకున్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన తేదీలవారీగా హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో తొలిరోజు రిక్రూట్‌మెంట్ కోసం స్టేడియానికి చేరుకున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పగడ్బంధీగా నిర్వహించేందుకు 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు జరిగే స్టేడియంలోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. వీరికితోడు మెడికల్, రెవెన్యూ సిబ్బంది అదనంగా జిల్లా అధికారులు నియమించారు.