దీంతో తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డిని బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే జిల్లా కలెక్టర్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన రోజు నుంచి ఆర్నెల్లపాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. అదేసమయంలో కొండ్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.