స్థానిక గవర్నర్ పేట ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవ సభలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. 1920లో పుట్టిన కమ్యునిష్టు పార్టీ స్వరాజ్య నినాదాన్ని ఇచ్చిందన్నారు. బ్రిటిషు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకం గా ప్రజలను భాగస్వాములను చేయటానికి సంఘాలను నిర్మించిందని చెప్పారు.
అనేక అణిచివేతలు, మోసపూరిత కేసులు ఎదుర్కుంటు కమ్యునిష్టులు పురొగమించారని తెలిపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం వంటివి ఆయా రాజ్యాలు మన దేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాయన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో కమ్యునిష్టుల పాత్ర ముఖ్యమైందని చెప్పారు.
సోషలిజం ప్రస్తుత కాలంలో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుందని చెప్పారు. డి.కాశీనాధ్ అధ్యక్షత వహించిన ఈ సభలో సి హెచ్ బాబూరావు, డివి కృష్ణ, కె.శ్రీదేవి, డి.విష్ణు వర్ధన్, నాగొతి ప్రసాద్, బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.