వైజాగ్ నగరంలో Google AI hub కేంద్రాన్ని తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. Vizag లోని G కాస్త Googleగా నిలబడింది అంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు డైనమిక్ నగరమైన విశాఖపట్నంలో గూగుల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గిగా-వాట్-స్కేల్ డేటా సెంటర్‌లను కలిగి ఉన్న ఈ పెట్టుబడి అభివృద్ధి చెందిన భారతదేశం వృద్ధికి ఎంతో దోహదపడుతుందని ప్రధాని అన్నారు.
గూగుల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏఐని బలోపేతం చేసేందుకు విశాఖలో హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రధాని అన్నారు. ఇది భారతీయ పౌరులను అధునాతన డిజిటల్ సాధనాలతో సన్నద్ధం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి ప్రయత్నాలు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంచుతూనే సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేస్తాయని మోదీ పునరుద్ఘాటించారు.
భారతదేశ సాంకేతిక ప్రయాణంలో విశాఖపట్నం AI హబ్ ఒక మైలురాయి ప్రాజెక్టు అని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసించారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ హబ్ కోసం గూగుల్ ప్రణాళికలను వివరించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.