అత్యవసర వైద్య సేవలలో సువర్ణాధ్యాయం : మంత్రి విశ్వరూప్

గురువారం, 2 జులై 2020 (16:26 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు అత్యవసర వైద్య సేవలలో సువర్ణాధ్యాయం మొదలయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 104, 108 సేవల విభాగంలో సేవలందించేందుకు జిల్లాలో నూతన వాహన శ్రేణిని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణం నుండి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 1088 వాహనాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించగా జిల్లాకు 39 సంచార వైద్య శాలలు (104), 62 నూతన అంబులెన్స్ (108)వాహనాలు అధునాతన సేవలు అందిస్తాయని తెలిపారు.

ఇప్పటికే ఉన్న వాహనాలకు ఇవి అదనమని తెలిపారు. ఆపదలో ఉన్న వారి పిలుపు అందుకున్న 20,25 నిముషాలు వ్యవధిలోనే వారివద్దకు చేరుకుని ప్రాణాపాయం నుండి రక్షించేందుకు చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాగే వాహన సిబ్బందికి పెరిగిన వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జేసీ (డి) కీర్తి, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎమ్.మల్లిక్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఎమ్.రాఘవేంద్రరావు, ఆరేమ్సి ప్రిన్సిపాల్ డా.బాబ్జి, పలువురు వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు