పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సీతక్క

శనివారం, 18 జులై 2020 (20:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ విజృంభిస్తుంటే మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవరిస్తున్నారంటూ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రజలకు సరైన రీతిలో అవగాహన కల్పించకపోవడంతో గ్రామాల్లో ఇప్పటికీ శానిటైజర్, మాస్కులు వాడడం లేదన్నారు. పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని…ఆ బాధ్యత ను కూడా ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ లో కరోనా వైరస్ ను ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించి ఉచితంగా పేదలకు  కరోనా ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు