ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను తగ్గించిన ప్రభుత్వం మరొక 13 శాతం తగ్గిస్తూ జీ.వో. ఎం.ఎస్.నెం.133 ఇవ్వటం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం హర్షం వ్యక్తం చేశారు.
4380 పర్మిట్ రూమ్ లు రద్దు చేశారని, 20 శాతం మద్యం దుకాణాలు రద్దు చేశారన్నారు . అంతేకాక మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని బాగా తగ్గించారని, ఇప్పుడు తాజా జీవోతో మొత్తం 33 శాతం మద్యం దుకాణాలను రద్దు చేశారని, మహిళలకు ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా మద్యం తాగే అలవాటును తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.