అయితే, భార్యకు చెప్పకుండా ఆమె బంగారాన్ని అతడు కుదువ పెట్టాడు. మరో వ్యక్తితో కలిసి వచ్చిన సొమ్ముతో ఆటో కొన్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో.. తన బంగారు నగలు తిరిగి తీసుకొస్తే తప్ప కాపురానికి రానని తేల్చి చెప్పింది.
రాత్రికి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో శ్రీను చోరీకి ప్లాన్ చేశాడు. ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.50 వేల డబ్బు దోచుకెళ్లాడు.
అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన నగలు, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు జైలు శిక్ష విధించింది.