నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:02 IST)
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.  3,335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33,632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మంగళవారం నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదో తేదీన పరిశీలన మొదలవుతుంది. 8న మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని అదే రోజు తుది జాబితాను ఖరారు చేస్తారు.

13వ తేదీ పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు సాయంత్రంగానీ, లేక మరుసటిరోజు ఉదయం గానీ ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటారు.
 
నేడు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఈరోజు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష చేయనున్నారు.

అనంతరం రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్‌ఈసీ చర్చలు జరుపనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు