జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది: దీపక్ రెడ్డి
ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:20 IST)
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నాశనమైందని, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు ఏపీలో తాండవ మాడుతున్నాయని, ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి దీపక్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం పొలిటికల్ టెర్రరిజం అనే అజెండాతో ముందుకు సాగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి, రాష్ట్రాన్ని పాలెగాళ్ల రాజ్యంగామార్చాలనే ఏకైకలక్ష్యంతోనే పాలకులు పనిచేస్తున్నారన్నారు. టీడీపీ అడ్డులేకుంటే విచ్చలవిడిగా దోపీడీ చేయొచ్చనే ఆలోచనలో పాలకులు ఉన్నారన్నారు. జరుగుతున్న దారుణాలపై ప్రజలు మౌనంగా ఉంటే, భవిష్యత్ లో అందరూ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని దీపక్ రెడ్డి హెచ్చరించారు.
వైసీపీ వారికి భజనచేయకపోయినా, ఎదురుతిరిగినా, ఎటువంటి గతి పడుతుందో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలేప్రత్యక్ష నిదర్శనాల న్నారు. తాడిపత్రిలో 40ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న జే.సీ. కుటుంబం హాయాంలో అక్కడిప్రజలు ప్రశాంతంగా బతికారని, కానీ నేడు అక్కడ జరుగుతున్న సంఘటనలు స్థానికులను భయభ్రాం తులకు గురిచేస్తున్నాయన్నారు.
స్థానిక ఎమ్మెల్యే సతీమణి ఎద్దులబండి ఇసుకకు రూ.10వేలువసూలుచేస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చాయన్నారు. ఆ సంభాషణలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయని, అంతమా త్రానికే సదరు అధికారపార్టీ ఎమ్మెల్యే ఇసుక వసూళ్లపై వివరణ ఇచ్చుకోకుండా వీరంగం వేశాడన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అలా ప్రవర్తిస్తే, టీడీపీ వారినినోటికొచ్చినట్టల్లా దూషిస్తున్నందుకు వైసీపీ వారిని ఏం చేయాలో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ వాహనం, పోలీసుల భద్రత ఉంటుందని, వారందరికీ తెలిసే, వారి సహకారంతోనే సదరు వైసీపీఎమ్మెల్యే అనుచరులతో జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చాడని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు.
వాహనాల్లో కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో వచ్చిన వ్యక్తులు శాంతికోసం, చర్చలకోసం వచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసి, ఎమ్మెల్యే అతని అనుచరులు వెళ్లిపోయాక, ప్రభాకర్ రెడ్డి తనఇంటికి వచ్చాక, తిరిగిఎమ్మెల్యే కారు విపరీతమైన వేగంతో జే.సీ ఇంటిముందునుంచి ఆయనఅనుచరులపైకి దూసుకొచ్చిం దన్నారు.
పోలీసుల సాయంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు జే.సీ ప్రభాకర్ రెడ్డిపైకి రాళ్లురువ్వారని, అక్కడి పోలీసులు నిజంగా 144 సెక్షన్ అమలుచేస్తే, ఎమ్మెల్యే, అతనికొడుకు, వారి అనుచరులు జే.సీ. ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఎలావచ్చిందో సమాధానం చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే, అతని అనుచరులు రాళ్లు వేస్తున్నప్పుడు చూస్తూకూర్చున్న పోలీసులు, తమను తాము రక్షించుకోవడంకోసం జే.సీ.మనుషులు రాళ్లువేయగానే ఖాకీలు వారిపైపడి వారిని కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నారు. పోలీసుల అండ దండలతోనే ఎమ్మెల్యే, అతనికొడుకు, వారి అనుచరులు జే.సీ.ప్రభా కర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వచ్చారన్నారు. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే, అతని అనుచరులపై, ప్రభాకర్ రెడ్డి మనుషులు దాడిచేశారంటూ వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, 307కేసు పెట్టడం జరిగిందన్నారు.
ప్రభాకర్ రెడ్డి ఇంటిలోకి ఆయుధాలు తీసుకెళ్లడం, ఆయన ఇంటిపైకి రాళ్లేయడం చేసినవారిని వదిలేసి, ప్రభాకర్ రెడ్డిపై, అతని మనుషులపై తప్పుడుకేసులు పెట్టడంచూస్తేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఇంత జరిగితే రాష్ట్ర హోం మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ. ఇంటికి శాంతిచర్చలకు వెళ్లారని చెప్పడం సిగ్గుచేటుకాక ఏమవతుందన్నారు.
గతంలో స్థానికఎన్నికల నోటిఫికేషన్ వెలుబడిన సమయంలో భాస్కర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్తను వీరాపురంలో హత్యచేశారని, భాస్కర్ రెడ్డి భార్యపై, అతని కుటుంబంపై తప్పుడుకేసులుపెట్టి, ఊరువదిలిపోయేవరకు పోలీసులు వేధించారన్నారు. ఆనాడు జరిగిన దారుణంపై టీడీపీఅధినేత చంద్రబాబు స్పందించినా, పోలీసులు తప్పుడుకేసులను వెనక్కు తీసుకోలేదన్నారు.
మరోఘటనలో టీడీపీకిచెందిన సర్పంచ్ అభ్యర్థిని వైసీపీలో చేరాలనిబెదిరించారని, ఆయన అందుకు నిరాకరించాడన్న అక్కసుతో బట్టలూడదీసి పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టడం జరిగింద న్నారు. ఆ విధంగా పోలీసులు వ్యవహరించినా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదాఖలాలు లేవన్నారు. సోమినాయుడు అనే మరోటీడీపీకార్యకర్త ఇంటిలో లేని సమయంలో అతని ఇంటిని కూల్చడానికి ప్రయత్నించారన్నారు.
పోలీసులే దగ్గరుండి గూండా ల్లా ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయన్నారు. కడపజిల్లా లో రషీద్అనే టీడీపీకార్యకర్త ఇంటిలోకి సివిల్ డ్రస్ లో ఉన్న పోలీస్అధికారి వెళ్లి వీరంగం వేశాడన్నారు. సినిమాల్లో చూడని విధంగా అనేకసంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా, పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ప్రజలు గమనించాలన్నారు. తమ, మాన,ప్రాణాలకు, ఆస్తులకు రక్షణలేదనే నిజాన్ని ఏపీ వాసులు గమనించాలన్నారు. బయట వైసీపీకార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, ఆపార్టీనేతలు మండలిలో,అసెంబ్లీలో అంతకం టే దారుణంగా ప్రవర్తించిన తీరు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకుంటున్నవారు, ఆయన తీసుకొచ్చిన మండలినే ఆయనవారసుడు రద్దుచేయడా నికి సిద్దమయ్యాడన్నారు. బెదిరించి, భయపెట్టి, ఎవరినీ లొంగదీ సుకోలేరనే నిజాన్ని పాలకులు గ్రహించాలని దీపక్ రెడ్డి హితవు పలికారు. జే.సీ.ప్రభాకర్ రెడ్డి బస్సులను అకారణంగా సీజ్ చేస్తే, హైకోర్టు అధికారులకు అక్షింతలు వేసి, చేసింది తప్పని చెప్పడం జరిగిందన్నారు.
అంతటితో ఆగకుండా ప్రభాకర్ రెడ్డిని, అతనికుమారుడిని వేధించి, తప్పుడుకేసులు పెట్టి జైలుకు పంపార న్నారు. ప్రజలజీతం తీసుకుంటూ పనిచేస్తున్న పోలీసులే అధికార పార్టీవారు చేస్తున్న నేరాల్లో భాగస్వాములవ్వడం దారుణమన్నా రు.
తాడిపత్రి ఎమ్మెల్యే , అతని కొడుకు, వారి అనుచరులు స్పష్టంగా ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లినదృశ్యాలు కళ్లముందు కనిపిస్తుంటే రాష్ట్ర హోంమంత్రి శాంతిచర్చలకు వెళ్లారని చెప్పడం, జిల్లా ఎస్పీ పోలీసులతీరునిసమర్థించడం ఏమిటని దీపక్ రెడ్డి నిలదీశారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబంపై జరిగిన దాడిలో పోలీసులు కూడా నిందితులేనని, వారి ప్రోత్సాహం, సహాయ సహకారాలతోనే అక్కడ దాడి జరిగిందన్నారు.
కాబట్టి పోలీసులపై కూడా కేసులు పెట్టాలని, హోంమంత్రి ఇప్పటికైనా సిగ్గుతో తనకు తానురాజీనామా చేస్తే మంచిదని దీపక్ రెడ్డి తేల్చిచెప్పారు. తాడిపత్రిలో జరిగిన ఘటన భవిష్యత్ లో, రాష్ట్రంలో ప్రతిచోటా జరుగుతుందనే వాస్తవా న్ని ప్రజలు గమనించాలన్నారు. పాలకుల విధానలకు వ్యతిరేకంగా ప్రజలు బయటకు రాకుంటే, రాచరికవ్యవస్థలోకి వెళ్లిపోయి, బానిసలుగా బతకడం ఖాయమని టీడీపీనేత స్పష్టంచేశారు. తాడిపత్రి ఘటనపై ప్రజలే అంతిమతీర్పు ఇవ్వాలన్నారు.