చంద్రబాబు - పవన్ చేతులు కలిపితే వైకాపాకు భవిష్యత్ లేదు : జ్యోతుల నెహ్రూ

మంగళవారం, 1 నవంబరు 2022 (19:38 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిస్తే వైకాపాకు భవిష్యత్ అంటూ ఉండదని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. రాజమండ్రిలో వైకాపా కాపు మంత్రులు నిర్వహించిన సమావేశంతో కాపు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఐక్యంగా ఉండే కాపు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ సమావేశం నిర్వహించారన్నారు. 
 
దీనిపై జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ, కాపులను రెచ్చగొట్టేలా కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 
 
వంగవీటి రంగా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు వైకాపాలోనే ఉన్నారని గుర్తు చేసిన జ్యోతుల నెహ్రూ.. ఈ విషయాన్ని వైకాపాలోని కాపు నేతలు మరిచిపోరాదని కామెంట్స్ చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబు హయాంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారనే విషయాన్ని వైకాపా కాపు ప్రజాప్రతినిధులు గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు