కర్నూలు జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

శనివారం, 11 జులై 2020 (09:17 IST)
కర్నాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై మాధవరం పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు కర్ణాటక నుంచి బసాపురం అటవీ ప్రాంతంలో వస్తుండగా కోసిగి మండలం సాతనూరు వద్ద పోలీసులు తనిఖీ చేసేందుకు ఆపారు.
 
 అయితే ఇది గమనించిన వాహనంలోని వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేశారు. అందులో 1440 మద్యం బాటిళ్లు బయల్పడ్డాయి.

దీంతో అందులో వున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్లు గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన మాధవరం పోలీసులను సీఐ కృష్ణయ్య అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు