టీడీపీ నేత హౌస్ అరెస్ట్... మదనపల్లెలో ఉద్రిక్తం

ఆదివారం, 28 జూన్ 2020 (13:03 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అరెస్ట్ ఉద్రిక్తతకు దారి తీసింది. మదనపల్లె పట్టణంలోని వక్ఫ్ బోర్డు స్థలాల వివాదంలో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వక్ఫ్ బోర్డు భూముల్లో తాత్కాలిక షెడ్ల తొలగింపును ప్రశ్నించినందుకు గాను టీడీపీ నేత మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పట్టణంలోని వక్ఫ్ బోర్డు స్థలాల్లో కొంతమంది తాత్కాలిక షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్న షాజహాన్ భాష కొంత మందికి అక్కడ షెడ్లు వేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ భాష దీనిపై దృష్టి సారించారు. ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని షెడ్లను తొలగించే చర్యలు చేపట్టారు.

అంతకన్నా ముందే మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నిర్బంధించారు. దీంతో మదనపల్లె పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు