కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన గర్భిణీ..తల్లీ బిడ్డ క్షేమం

మంగళవారం, 2 జూన్ 2020 (20:48 IST)
కరోనా బాధితురాలైన గర్భిణీ.. ఆ మహమ్మారిని జయించడంతో బాటు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా వుండడం విశేషం.

ముంబయి నుండి కర్నూలు జిల్లాకు తిరిగి వచ్చిన వలస కార్మికురాలు (ఆస్పరి మండలం నల్లమేకలపల్లి గ్రామవాసి)  21 సంవత్సరాల నిండు గర్భిణీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు, డాక్టర్లు మే నెల 12న విశ్వభారతి జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా అనంతరం, డాక్టర్లు, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సూచనలతో కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి(బాబు కు కరోనా నెగటివ్), తాను కూడా కరోనాను జయించి నిన్న రాత్రి విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అడం విశేషం.

జిజిహెచ్, విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది, అధికారుల టీమ్ లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా డిశ్చార్చ్ అయిన కరోనా బాధితులకు ఒక్కొక్కరికి రూ.2000/-ల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు