హమ్మయ్య, తిరుమలలో ముగ్గురు అర్చకులు కరోనాను జయించారు, ఎలా?

సోమవారం, 20 జులై 2020 (22:15 IST)
తిరుమలలో మొత్తం 18 మంది అర్చకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇది కాస్త దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే అర్చకులకు వైరస్ సోకితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనుకున్నవారు లేకపోలేదు. దాంతో పాటు కరోనాతో ఆసుపత్రుల్లో చేరితే చివరకు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 8వ తేదీన తిరుమలలో పనిచేసే అర్చకులకు కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే స్విమ్స్‌ లోని కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స అందించిన తరువాత వారు ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు స్విమ్స్ వైద్యులు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అర్చకులు హోం క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు.
 
15 రోజుల పాటు హోం క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా ఆ తరువాత డిశ్చార్జ్ అయిన వారిలో మొదటగా అర్చకులే ఉండటంతో టిటిడి సిబ్బంది, ఉన్నతాధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మిగిలిన వారు కూడా ఆరోగ్యంగా బయట పడాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు