ఈ సందర్భంగా సోమవారం గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు (షాపులు) పూర్తిగా తెరచి ఉంచి వ్యాపారం నిర్వహించుట శ్రేయస్కరం కాదన్నారు.
ప్రజల, వ్యాపారస్తులు, వివిధ సంఘాలు, ముఠా కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులు స్వియ నియంత్రణతో ఖచ్చితంగా షాపులు 2 గంటల వరకూ మాత్రమే తెరచి వుంచి వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు.