కోర్టు ద్వారా దాన్ని తను తీసుకుని సంతకం పెట్టి పంపించడం జరిగింది. దానితో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒంటరిగా ఇంట్లో ఉండి, మద్యం సేవించి నిన్నటి అర్ధరాత్రి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుని చనిపోయాడు.
ఉదయం 11 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అపార్ట్మెంట్ వాసులు బలవంతంగా డోరు తెరిచి చూడగా చైతన్య అప్పటికే చనిపోయి ఉన్నాడు.. అతని మేనత్త శ్రీమతి కీత రాధ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.