Sri Vishnu : గన్స్ తో యాక్షన్ చిత్రంతో రాబోతున్న శ్రీ విష్ణు

దేవీ

మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (10:49 IST)
Sri Vishnu
పలు భిన్నమైన కథలతో వెండితెరపై కనిపించిన కథానాయకుడు సామజరవనగమన వంటి ఫుల్ ఎంటర్ టైన్ మెంటతో అలరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిత్రాలు సాదాసీదాగా సాగినవే. కాగా, ఈసారి శ్రీ విష్ణు గన్స్, ఫారెస్ట్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ తో కూడిన వీడియో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది.
 
హీరో శ్రీ విష్ణు, జానకిరామ్ మారెళ్ల, కోన వెంకట్ ప్రజెంట్స్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ కొత్త సినిమా అక్టోబర్ 2న టైటిల్ ప్రకటించనున్నారు.  కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు.
  సినిమా టైటిల్ ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు.  
 
ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, కమెడియన్ సత్య, రెడిన్ కింగ్స్లీకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.  
 
నటీనటులు: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, శ్రీకాంత్ అయ్యంగార్, కమెడియన్ సత్య, కమెడియన్ సుదర్శన్, రెడిన్ కింగ్స్లీ, రఘు బాబు, మురళీధర్ గౌడ్, సునైనా, బుల్లిరాజు, ముక్కు అవినాష్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు