Pawan: దేవుని కృప ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ పవన్ ను ఆశీర్వదించిన చిరంజీవి

దేవీ

మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (10:40 IST)
Pranam khareedu poster, mega family
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
22 సెప్టెంబర్ 1978  కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
 
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ".
 
ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ.. కృతజ్ఞతలతో  - మీ చిరంజీవి.
 
దీనికి పవన్ కళ్యాణ్ స్పందించిన ట్వీట్ తో చిరంజీవి రీ ట్వీట్ చేసి ఇలా పేర్కొన్నారు.
ప్రియమైన కళ్యాణ్ బాబు,
మీ మాటలు నన్ను గాఢంగా తాకాయి మరియు ఆ తొలి రోజులకు నన్ను తిరిగి తీసుకెళ్లాయి.
ప్రాణం ఖరీదు నుండి ఈ రోజు వరకు, మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు మరియు ప్రేక్షకుల ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తున్నాను. ప్రతిదానికీ చాలా ధన్యవాదాలు. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక!
ఓజీ ట్రైలర్ నాకు చాలా నచ్చింది మరియు మొత్తం బృందం నిజంగా అర్హులైన గొప్ప విజయాన్ని కోరుకుంటున్నాను.   అన్నయ్య..Priyamaina kaḷyāṇ bābu,
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు