కాగా, గత యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ మెట్లమార్గం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీనికి ఐదు నెలలుగా మరమ్మతులు చేపట్టారు. తిరుమలకు నడిచి వెళ్లేందుకు భక్తులు అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేసేందుకు రూ.3.60 కోట్లను తితిదే ఖర్చు చేసింది.
800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్ఠంగా నిర్మించారు. గురువారం ఈ మార్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఇప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు.