తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలి: శైలజానాథ్‌

శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:19 IST)
తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికార యంత్రాంగం వైసీపీకి మద్దతుగా పనిచేస్తోందన్నారు. వైసీపీ ప్రభత్వం ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వైసీపీకి ఓటేయాలంటూ వలంటీర్లు ప్రలోభపెడుతున్నారని శైలజానాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని  శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు