కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...

బుధవారం, 5 మే 2021 (16:48 IST)
కోవిడ్‌తో చనిపోయిన 21 మంది అనాధ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రుయాలోని మార్చురీ నుంచి స్వయంగా తన చేతులతో మృతదేహాలను మోసి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ తరువాత వాటిని మామండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఖననం చేశారు. 
 
ఈ సంధర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు అంత్యంత ఆత్మీయులుగా మనతో, మన మధ్య తిరిగిన వారు కరోనా కారణంగా చనిపోతే మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోయిన వారు, ఆర్థిక సమస్యలతో మృతదేహాలను వదిలి వెళ్ళిపోయిన వారికి సంబంధించి మొత్తం 21 మృతదేహాలను గుర్తించామన్నారు. అందుకే అలాంటి వారికి అన్నీ తానై అంతిమ సంస్కారం చేసినట్లు చెప్పారు. తనకు 60 సంవత్సరాల వయస్సు పైబడిందని.. ఇప్పటికే రెండుసార్లు కరోనా కూడా సోకిందని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
 
అయినా సరే ఎలాంటి భయాందోళనకు తాను గురికావడం లేదని.. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు