సొంత కుమార్తె భర్తను పెళ్లి చేసుకునేందుకు కన్నతల్లి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తె కన్న తల్లి ప్రయత్నాన్ని అడ్డుకుంది. దీంతో కుమార్తెపై పగబట్టిన తల్లి... అల్లుడుతో కలిసి కుమార్తెను హత్య చేసేందుకు యత్నించింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఓ గ్రామానికి చెందిన బాలుడు (18), బాలిక (15)లు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆమెకు అల్లుడుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శుక్రవారం రాత్రి తన అల్లుడు అతని భార్య పక్కన ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అత్త.. అల్లుడుతో మెడలో తాళి కట్టించుకునేందుకు ప్రయత్నించింది.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుమార్తె తన భర్త చర్యను అడ్డుకుంది. తన తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త కలిసి బాధితురాలిపై దాడికి దిగారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలికను కాపాడారు. అత్త, అల్లుడుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.