శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులను కరుణిస్తుంది. కుడివైపున లక్ష్మీదేవీ, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా చెఱకుగడ, విల్లు పాశాంకుశలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరల్లో దర్శనమిస్తుంది.
ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు... ఇలా పదిరకాల నైవేద్యాలను సమర్పిస్తారు.