ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. ఏదేని విపత్తులు సంభవించినపుడు, యుద్ధ సమయాల్లో అత్యవసర రవాణా కోసం దేశంలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రన్‌వేలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేలు నిర్మించారు.
వీటిపై నేడు అధికారులు కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో సుఖోయ్ 30, హాక్ యుద్ధ విమానాలు, ఏఎన్ 32 రవాణా విమానం, రెండు హెలికాఫ్టర్ పాల్గొన్నాయి. వాయుసేన విమానాలు రన్‌వేపై ఐదు మీటర్ల ఎత్తు వరకు వచ్చి మళ్లీ గాల్లోకి లేచాయి. ఇలా పలుమార్లు విన్యాసాలు చేపట్టారు.