కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన శివన్న, లోకేశ్, గంగరాజులు ఏపీలో వ్యక్తిగత పనులు నిమిత్తం కారులో కారులో వచ్చారు. వీరు తమ పనులు ముగించుకుని స్వగ్రానికి తిరిగి వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం కారణంగా కారులో ప్రయాణిస్తున్న శివన్న, లోకేశ్, గంగరాజు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.