టిటిడి ఆస్తులను అమ్మేస్తున్నారు, ఎవరు?

శనివారం, 23 మే 2020 (19:54 IST)
దేశవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు స్థలాలు, ఇళ్ల రూపాల్లో ఇచ్చిన ఆస్తులను వేలం వేసేందుకు టిటిడి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తొలుత తమిళనాడులోని 23 చోట్ల దాతలు ఇచ్చిన స్థలాలను బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయానికి పచ్చ జెండా ఊపేశారు. ఈ వేలం ద్వారా దాదాపు వంద కోట్లకు పైగా సమకూరే అవకాశం ఉంది. అయితే దాతలు ఇచ్చిన ఆస్తులను టిటిడి వేలం వేయాలని భావించడంపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు