కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక దూరం, మాస్కులంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు చెప్పినా కరోనాని మాత్రం జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.
మూడురోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కుమార గురు పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు ఉదయం రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో కుమారు గురు హోంక్వారంటైన్ లోనే ఉన్నారు. వైద్యులు ఆయనకు ఇంటి వద్దే చికిత్స చేస్తున్నారు.
అన్నాడిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన. గత కొన్నిరోజుల ముందు డిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూడా కరోనాతో మృతి చెందడం... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా రావడంతో రాజకీయ నాయకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మరోవైపు తమిళనాడులో కరోనావైరస్ కేసులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి.