విరిగిపడిన బండరాళ్లు .. తిరుమల రెండో కనుమ రహదారి మూసివేత

బుధవారం, 1 డిశెంబరు 2021 (08:53 IST)
ఇటీవల తిరుమల తిరుపతిని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు తరచుగా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు కొండ చరియలు (పెద్దపెద్ద బండరాళ్లు) విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో రెండో కనుమ రహదారిని మూసివేశారు. 
 
రెండో ఘాట్ రోడ్డు‌లో లింక్ రోడ్డు సమీపంలో కొండపైన నుంచి రహదారిపై ఒక్కసారిగా ఈ బండరాళ్లు, మట్టి విరిగిపడింది. దీంతో మూడు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల వాహనాలను విజిలెన్స్ నిలిపివేశారు. 
 
తితిదే ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు కొండ చరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే, రెండో కనుమ రహాదారిలో వాహనాలను నిలిపివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు