తిరుమలకు చేరుకున్న వై.వి.సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో టిటిడి ఛైర్మన్ చేత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వై.వి.సుబ్బారెడ్డికి ఎప్పటివరకు ఆ పదవిలో ఉండనిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. గతంలో అయితే కేవలం సంవత్సరం పాటు ఆ పదవిలో ఛైర్మన్‌ను నియమించేవారు.
ఆ తరువాత ఛైర్మన్, సభ్యులు బాగా పనిచేస్తే మరో సంవత్సరం పొడిగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉందా అన్నది అనుమానంగా మారుతోంది. రెండున్నర సంవత్సరాల పాటు నామినేటెడ్ పదవుల్లో అలాగే ఉండనిస్తానని, అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం వెంటనే ఆ పదవి నుంచి తొలగిస్తానని జగన్ చెప్పారు.
దీంతో వై.వి.సుబ్బారెడ్డిని రెండున్నరేళ్ళ పాటు టిటిడి ఛైర్మన్‌గా కొనసాగిస్తారా లేకుంటే ఒక సంవత్సరం పాటు కొనసాగించి కొత్త వ్యక్తి మళ్ళీ టిటిడి ఛైర్మన్‌గా చేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వై.వి.సుబ్బా రెడ్డి క్రిస్టియన్ అంటూ ప్రచారం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది. దీంతో వై.వి.సుబ్బా రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఐతే ఇప్పటికే తను హిందువునన్న విషయాన్ని తన ఇంట్లో ఏ గోడను అడిగినా చెబుతుందని స్పష్టీకరించారి వైవీ. నమో వేంకటేశాయ.